టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

by Satheesh |
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: పదవ తరగతి ఫెయిలైన విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇవాళ విడుదల చేసిన ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 14వ తేదీ నుంచి 22 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కలిస్తున్నట్లు వెల్లడించారు. ఇక, మార్క్స్ రీకౌంటింగ్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలని పేర్కొన్నారు. ఫలితాల విడుదల నేపథ్యలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సూచనలు చేశారు. ఇంటర్, టెన్త్ విద్యార్థులు ఎవరూ తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు వెంటనే ఉంటాయని, అదైర్య పడొద్దని కోరారు. ఈ ఫలితాలే ప్రమాణికం కాదని.. వీటి కోసం ఆత్మహత్యలకు పాల్పడి కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దని సూచించారు. విద్యార్థులు తమ కుటుంబాల గురించి కూడా ఒకసారి ఆలోచించాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story