10th Exams : ఈనెల 21 నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు

by M.Rajitha |   ( Updated:2025-03-18 14:53:47.0  )
10th Exams : ఈనెల 21 నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో పదవ తరగతి పరీక్షలు (10th Exams) మరో మూడురోజుల్లో మొదలవనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21న తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 5 లక్షల 9 వేల 403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం 2,650 పరీక్షా కేంద్రాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్(Board Of Secondary School) ఏర్పాటు చేసింది. నిర్దేశించిన రోజున ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్(Hall Tickets) ను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని, పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురవ్వకుండా పరీక్షలు రాసేలా టీచర్లు, తల్లిదండ్రులు శ్రద్ద వహించాలని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 7 నుంచి 15 వరకు జరగనుంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఏపీలో 10వ తరగతి పరీక్షలు ఇప్పటికే మొదలయ్యాయి.

Next Story