TS: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులకు బిగ్ అలర్ట్

by GSrikanth |
TS: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్షల ఫీజు షెడ్యూల్ విడుద‌లైంది. వ‌చ్చే ఏడాది మార్చిలో టెన్త్ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వహించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠ‌శాల‌ల్లో ప‌ది చ‌దువుతున్న విద్యార్థుల నుంచి వార్షిక ప‌రీక్షల ఫీజు వసూళ్లు చేయాల‌ని ప్రభుత్వ ప‌రీక్షల డైరెక్టర్ గురువారం ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. న‌వంబ‌ర్ 17వ తేదీలోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 50 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు, రూ. 200తో డిసెంబ‌ర్ 11, రూ. 500 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు ఫీజు చెల్లించొచ్చు. రెగ్యుల‌ర్ విద్యార్థులు రూ. 125, మూడు సబ్జెక్టులు, అంత కంటే త‌క్కువ స‌బ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110, మూడు కంటే ఎక్కువ స‌బ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125, వొకేష‌న‌ల్ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story