- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYD: కత్తులతో పొడిచి యువకుని హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?
దిశ, బడంగ్ పేట్ : అర్థరాత్రి వాష్ రూమ్‌కని ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఓ డిగ్రీ విద్యార్థిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా హతమార్చిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... నాగర్ కర్నూల్ వెల్డండ మండలానికి చెందిన డెగావత్ ఫూల్ సింగ్ కుటుంబం 20 ఏళ్ల క్రితం షాహిన్ నగర్‌లోని వాది యే ఉమర్ ప్రాంతానికి వలస వచ్చారు.
ఫూల్‌సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక్క కుమారుడు సంతానం. డెగావత్ పవన్ (22) డిగ్రీ చదివేవాడు. సంవత్సర కాలంగా పవన్‌కు అదే ప్రాంతానికి చెందిన వేరే వర్గానికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. మరొమారు బుధవారం సాయంత్రం కూడా యువతి బంధువులు పవన్‌తో డబ్బుల విషయంలో గొడవకు దిగినట్లు తెలిసింది.
ఇరు వర్గాల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తాయి. కాసేపటికే ఎవరి దారిన వారు వెళ్లి పోయారు. రాత్రి 11.40 గంటలకు పవన్ వాష్‌రూమ్‌కని బయటికి వచ్చాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా దాడిచేశారు. తీవ్ర గాయలైన పవన్ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి కుప్ప కులాడు. దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి కూడా వస్తుండడాన్ని గమనించిన కుటుంబసభ్యులు పెద్ద పెట్టున కేకలు వేశారు.
దీంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పవన్‌ను చికిత్స నిమిత్తం ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహేశ్వరం డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ అంజయ్య, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌లు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పవన్‌పై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు పవవ్ ప్రేమించిన యువతి బాబాయ్ గౌస్, సద్దాంలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.