- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ బాధ్యతల్లో ఆ ఇద్దరు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు అనారోగ్యంతో సెలవుల్లో ఉండడంతో ఆ బాధ్యతలను వేరే అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం సింగరేణి సీఎండీగా ఉన్న శ్రీధర్‌కు తెలంగాణ జెన్‌కో బాధ్యతలను, ప్రస్తుతం ట్రాన్స్ కో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాసరావుకు ఆ సంస్థ సీఎండీ బాధ్యతలను అప్పగిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభాకర్ రావు తిరిగి విధుల్లో చేరేంత వరకు వీరిద్దరూ అప్పటికే కేటాయించిన బాధ్యతలతో పాటు అదనంగా కేటాయించిన బాధ్యతలను తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు నిర్వర్తిస్తారని గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వృద్ధాప్యం రీత్యా అనారోగ్యంలో ఉన్న తెలంగాణ ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు గత కొంతకాలంగా లీవ్‌లో ఉన్నారు. ఈ నెల 18వ తేదీన ఆయన విధుల్లో చేరే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. అయితే మరిన్ని రోజులు సెలవులో ఉండాల్సి రావడంతో ప్రభుత్వం ట్రాన్స్ కో, జెన్‌కో బాధ్యతలను విడదీసి వేర్వేరు అధికారులకు అప్పగించింది.