- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూన్నాళ్ల ముచ్చటగా ‘కేటీఆర్ పిలుపు’
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజాప్రతినిధులు, అధికారులంతా కలిసి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ 2019 సెప్టెంబర్‌లో ‘సన్ డే డ్రై డే’ పేరుతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా వ్యాధుల వ్యాప్తి కారకాలైన దోమల నివారణ ఎంతో ముఖ్యమని గుర్తించి ఎవరి ఇళ్లలో వారు స్వయంగా శుభ్రం చేసి, నీటి నిలువలను తొలగించే విధంగా ‘ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాలకు’ ఈ కార్యక్రమం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఆదివారం హడావిడిగా డ్రైడేను నిర్వహించారు. వీరంతా తమ ఇళ్లలోని, కార్యాలయాల్లోని నీటి తొట్టిలను, పరిసరాలను క్లీన్ చేశారు.
డ్రై డేని కొద్ది వారాల పాటు నిర్వహించి, అన్ని కార్యక్రమాలుగానే ఇదీ మధ్యలోనే నిలిచిపోయింది. అయితే డ్రై డే జరిపిన కారణంగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల సంఖ్య తగ్గిందని వైద్యాధికారులు స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. సత్ఫలితాలు ఇచ్చిన కార్యాక్రమాన్ని మధ్యలోనే నిలిపివేయడం పై విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా లాంటి మహమ్మారి వ్యాప్తి నివారణకు, వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నివారించేందుకు దీన్ని మరలా ఆచరణలోకి తీసుకురావాలని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడూ ఏదో పిలుపునిస్తూ కొద్ది రోజులు చేసి, మరిచిపోతుండటం ఆనవాయితీగా మారింది. దీంతో మంత్రి పిలుపులకు సీరియస్ నెస్ లేదా అనే విమర్శులు వస్తున్నాయి. అయితే కేటీఆర్ కూడా గుర్తొచ్చినప్పుడల్లా సభలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు గుర్తు చేస్తూనే ఉంటున్నారు.
పరిసరాల శుభ్రతతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేలా మంత్రి కేటీఆర్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హరితహారంలో భాగంగా అన్ని పట్టణాల్లో ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ ఫ్రైడే గా పాటించాలని ఆయన కోరారు. గతేడాది తీసుకొచ్చిన ‘గ్రీన్ ఫ్రైడే’ తో ప్రతి శుక్రవారం మొక్కను నాటి, నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మంత్రి మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కమిషనర్లు, అదనపు కమిషనర్లను వీటిని పర్యవేక్షించాలని, ప్రజా ప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పచ్చదనం పెంపుకోసం మున్సిపల్ బడ్జెట్ లో10 శాతం నిధులు కేటాయించారు. వీటిలో ఎక్కువగా దోమలను తరిమే ‘మస్కిటో రిపెల్లెంట్’ మొక్కలను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమం కూడా గతేడాది ప్రారంభమయి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
రాష్ట్రంలో పచ్చదనంతో కూడిన ఆరోగ్యాన్ని ప్రజలకు అందించే విధంగా కేటీఆర్ తీసుకొచ్చిన కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పక్కన పెట్టేశారు. ఇలా ఇవి మాత్రమే కాదు చేనేతలను ప్రోత్సహించేలా తీసుకొచ్చిన ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. ఇలా ఏదో ఓ కార్యక్రమంతో ముందుకొచ్చి వదిలి పెట్టడంతో ఏ కార్యక్రమం ఎక్కువ రోజులు జరగదని ప్రజలూ అభిప్రాయపడుతున్నారు.