- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోనాల ఉత్సవాల్లో తెలంగాణ ఎమ్మెల్యే.. తీన్మార్ స్టెప్పులు వేసి రచ్చ
దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణంలో బోనాల పండుగ, ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్నంటాయి. జీఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయం నుండి చేపట్టిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ తీన్మార్ స్టెప్పులు వేసి అందరిలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను అధికార పండుగగా ప్రకటించడం జరిగిందన్నారు.
ప్రపంచంలోని నలుమూలలా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. అనంతరం పట్టణంలోనీ ఏడు గుల్ల పోచమ్మ దేవాలయం, యాదవుల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీఐ వేణుగోపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వి.ఆదర్శ్ రెడ్డి, విజయ్ కుమార్, యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.