సీఎం వైఎస్ జగన్‌కు హైకోర్టు నోటీసులు

by srinivas |
jagan
X

దిశ, ఏపీ బ్యూరో: అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. బెయిల్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్ పై 11 ఛార్జిషీట్లు ఉన్నాయని… జగన్ బయట ఉంటే తన పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులపై కేసులను త్వరితగతిన ముగించాలని కోరారు. జగన్ బెయిల్ రద్దు చేసి అన్ని ఛార్జిషీట్లపై విచారణ వేగవంతం చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం సీఎం వైఎస్ జగన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలపాటు వాయిదా వేసింది.

Advertisement

Next Story