- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దిశ, మహబూబ్‌నగర్: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అందులో భాగంగానే నేడు రైతులు పండించిన పంటలకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మల్దకల్ మండలంలోని ఎల్కూర్ గ్రామంలో పప్పు శనగ కేంద్రాన్ని ప్రారంభించ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. రైతు భీమా, రైతుబంధు, సబ్సిడీ ద్వారా ఫర్టిలైజర్ రైతులకు పప్పు శనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం
జరిగిందన్నారు. పప్పు శనగ కోసం రైతులకు మద్దతు ధర రూ.4875లను నిర్ణయించడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారిని అరికట్టాలంటే ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. రైతులతో టోకెన్లు ఇచ్చి, పద్ధతి ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుందని, కావున దాని ప్రకారమే రైతులు కొనుగోలు కేంద్రానికి రావాలన్నారు. అధికారులు త్వరగా రైతులకు డబ్బులు వచ్చే విధంగా కృషిచేయాలని తెలిపారు. ప్రతిఒక్కరూ అందరూ ఇంట్లోనే ఉండాలి కరోనాని దేశం నుంచి తరిమి కొట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
Tags: Telangana Govt, support, farmers, mahaboobnagar, mLA bandla krishna mohan reddy