రైతుబంధు పంపిణీలో నిర్లక్ష్యం ఉండొద్దు

by Shyam |
రైతుబంధు పంపిణీలో నిర్లక్ష్యం ఉండొద్దు
X

దిశ, న్యూస్ బ్యూరో: రైతు బంధు పంపిణీలో నిర్లక్ష్యం వహించొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రైతు బంధు పంపిణీపై గురువారం బీఆర్కే భవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎస్… ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రైతుబంధు నగదును ప్రభుత్వం విడుదల చేసిందని, వెంటనే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. దీనిపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, సీసీఎల్ఏ డైరెక్టర్ రజత్ కుమార్ శైనీ, ఆర్థికశాఖ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు.

Advertisement

Next Story