- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు మధ్యాహ్నం 2గంటలకు కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్ పై కీలక ప్రకటన!
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రేపు(శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. ఈనెల 20తో రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రక్రియ( సాయంత్రం6 నుంచి ఉదయం 6వరకు) ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ప్రగతిభవన్ వేదికగా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మరోసారి కేబినెట్ మీటింగ్ జరగనుంది. లాక్డౌన్, గోదావరి నీటి ఎత్తిపోతలు, వానాకాలం సాగుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా 20వ తారీఖున లాక్‌డౌన్ ముగియనుండగా మరోసారి ఆంక్షలతో కూడిన కర్ఫ్యూ విధిస్తారా లేదా లాక్‌డౌన్ మొత్తానికే సడలిస్తారా అనేది కేబినెబ్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో నిర్భంధాన్ని మొత్తానికే ఎత్తివేసేందుకు సీఎం మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల డీఎచ్ శ్రీనివాస రావు కూడా ఇదే విషయమై ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.