- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కబ్జాలను మీరు అడ్డుకుంటారా.. మమ్మల్ని గుడిసెలు వేయమంటారా..?
దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం అశోక్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్-46 గల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం నిరుపేదలకు కేటాయించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మార్వో నాగరాజుకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జాటోత్ కృష్ణ మాట్లాడుతూ.. అశోక్ నగర్‌లో ఉన్న సర్వేనెంబర్- 46 భూమిని గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు ఆక్రమణ చేసి లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నారని, వారిపై చర్య తీసుకోవాలని కోరారు. ఎన్నిసార్లు అధికారులను కలిసి ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, రెవెన్యూ అధికారులు పాతిన బోర్డును సైతం తొలగించి ఆక్రమణకు పూనుకుంటున్నారని.. రెవెన్యూ అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో ఇంటి కోసం గుడిసెలు వేసుకున్న నిరుపేదలను బలవంతంగా ఖాళీ చేయించి, గుడిసెలు తొలగించే రెవెన్యూ అధికారులు అశోక్ నగర్‌లో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి అమ్ముకుంటుంటే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.రెవెన్యూ యంత్రాంగం ఇలాగే వ్యవహరిస్తే సర్వే నెంబర్ 46లో నిరుపేదలు గుడిసెలు వేస్తారని హెచ్చరించారు. వెంటనే అట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అమ్ముకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీను, మంగమ్మ, మల్లేశ్వరి, లింగయ్య, ఎస్ కె సలీమా, రాంబాయి, పుష్పలత పాల్గొన్నారు.