పోలీసులపై బీసీ కమిషన్‌కు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

by Shyam |
Teenmar Mallanna
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజాసమస్యలపై పోరాడుతున్న తనపై తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేపడుతుందని జర్నలిస్టు, తీన్మార్ మల్లన్న మంగళవారం జాతీయ ఓబీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. క్యూ న్యూస్ యూ ట్యూబ్ చానెల్‌ను నడపకుండా పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తనని నచ్చని వారు చేసే అర్థరహిత ఫిర్యాదులతో పోలీసులు మానసికంగా వేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు సుమారు 30 తప్పుడు కేసులతో సతాయిస్తున్నారని వివరించారు. తాను హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నప్పటికీ పోలీసులు పదే పదే 41 సీఆర్‌పీ నోటీసులు ఇచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని తీన్మార్ మల్లన్న ఓబీసీ కమీషన్‌కు వివరించారు. దీంతో తీన్మార్ మల్లన్నపై పెట్టిన కేసులపై 15 రోజుల్లో పూర్తి వివరాలతో నివేదికను అందించాలంటూ డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్‌ను బీసీ కమిషన్ ఆదేశించింది.

Advertisement

Next Story