- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
RSP పిలుపుతో BSPలోకి తీన్మార్ మల్లన్న టీమ్..?
దిశ, తెలంగాణ బ్యూరో : నిత్య కష్టాల్లో సైతం పేదలను సైతం అసలైన పాలకులుగా చేసేందుకే తన ఏడేళ్ల ఐపీఎస్ సర్వీస్‌ను సైతం త్యాగం చేసి బీఎస్పీలో చేరానని బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. బహుజనులకు న్యాయం చేయాలన్న ఆశతో తీన్మార్ మల్లన్న వెంట తిరిగి, ఇప్పుడు ఆయన బీజేపీలో చేరడంతో నిరాశకు గురైన మిత్రులందరూ బీఎస్పీలో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణలో గడీల దోపిడీ పాలనను అంతం చేసి నిజమైన బహుజన రాజ్యస్థాపన చేయగలిగిన సైద్ధాంతిక పునాది, మడమ తిప్పని నాయకత్వానికి మీరు కూడా తోడు రావాలని శుక్రవారం ఆయన ట్విట్టర్వేదికగా పిలుపునిచ్చారు.
అందరం కలిసి కవాతు చేద్దామని ఆయన తెలిపారు. జీవితం చాలా విలువైనదని, స్కీంలు, కేసుల నుంచి విముక్తి లాంటి బిస్కెట్టులు మనకు ఆశ చూపి మన నాయకత్వాన్ని ఇతరుల వద్ద నిరంతరం బానిసలుగా ఉండేలా ఆధిపత్య వర్గాలు శతాబ్దాలుగా కుటిల పన్నాగాలు చేస్తున్నాయన్నారు. దీనిని తరిమికొట్టాలంటే ప్రజలంతా గులాంగిరీని వదిలి బహుజనులుగా కావాలని, జై భీమ్నినాదాన్ని ఎంచుకోవాలన్నారు.