- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తీగల కృష్ణారెడ్డికి షాక్.. నడిరోడ్డుపై పోలీసులతో వాగ్వాదం
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సరూర్ నగర్ పోలీసులు షాక్ ఇచ్చారు. మాస్కు ధరించకుండా కారులో వెళ్తున్న కృష్ణారెడ్డికి జరిమానా విధించారు. మంగళవారం ఎల్బీనగర్ సమీపంలోని కర్మాన్‌ఘాట్ చౌరస్తా వద్ద తీగల కృష్ణారెడ్డి కారును పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్‌స్పెక్టర్ ముకేశ్, తీగల కృష్ణారెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులకు అందరూ సమానమే అంటూ రూ.వెయ్యి చలానా విధించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story