Fastest WiFi : ప్రపంచంలో అత్యంత వేగమైన వైఫై.. ఒక్క నిమిషంలోనే 9 సినిమాలు డౌన్‌లోడ్‌ చేయోచ్చు!

by Prasanna |
Fastest WiFi : ప్రపంచంలో అత్యంత వేగమైన వైఫై.. ఒక్క నిమిషంలోనే  9 సినిమాలు డౌన్‌లోడ్‌ చేయోచ్చు!
X

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ రోజు రోజుకు మారిపోతుంది. ఒకప్పుడు ఏదైనా చూసుకోవాలంటే.. వేరే ఊర్లకు వెళ్లే వాళ్ళు.. కానీ, ఇప్పుడు ఉన్న చోటలోనే మనకి కావాల్సింది చూసుకుంటున్నాం. ప్రస్తుతం, ఇంటర్నెట్ లేకపోతే ఏ పని జరిగేలా లేదు.. పల్లెటూళ్లలో కూడా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు నేడు మనకి అందుబాటులోకి ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు చిన్న సినిమా డౌన్‌లోడ్ చేయాలన్నా 24 గంటలు సమయం పట్టేది. కానీ, ఇప్పుడు క్షణాల్లోనే పని అయిపోతుంది. మారిన కాలంతో పాటు ఇంటర్నెట్ లో కొత్త మార్పులు వస్తున్నాయి. అయితే, ప్రపంచంలో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ ఉందని మీకు తెలుసా.. అవును ఇది నిజమే.. దీంతో వీడియోలను చాలా ఫాస్ట్ గా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం..

చైనాలో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. క్లౌడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ పేరుతో దీనిని తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీ సహాయంతో వన్ మినిట్ లోనే 9 మూవీస్ ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.8K రిజల్యూషన్‌తో వీడియోలు కావడం విశేషం.

ఈ ఇంటర్నెట్ సేవలను F5G-A అని పిలుస్తారు. ప్రపంచంలోనే తొలిసారి 10G క్లౌడ్ బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనిటీ షాంఘైలో 50G-PON టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలు చైనా టెలికాం షాంఘై సంస్థతో పాటు యాంగ్‌పు ప్రభుత్వ భాగస్వామ్యంతో లాంచ్ చేసారు. చైనాకు చెందిన అల్ట్రా ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీ మీ హోమ్ టెక్నాలజీని మారుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed