- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొబైల్ Specific Absorption Rate అంటే ఏమిటి.. ఎలా తెలుసుకోవాలి..
దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాం. మనం ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఇంటర్నెట్‌ని ఉపయోగించాలన్నా ఫోన్ నే ఉపయోగిస్తూ ఉన్నాం. అయితే స్మార్ట్‌ఫోన్ ని వినియోగిస్తున్నప్పుడు అది రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. ఈ రేడియేషన్ మన ఆరోగ్యానికి చాలా హానికలిగిస్తుందని, దీన్ని ఎవరూ గ్రహించలేరని నిపుణులు చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి వెలువడే రేడియేషన్‌ను రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్‌ఎఫ్) రేడియేషన్ అంటారు. ఈ రేడియేషన్ మన శరీరానికి హాని కలిగించి వ్యాధులు రావడానికి కారణమవుతుంది. స్మార్ట్‌ఫోన్ నుండి వెలువడే రేడియేషన్ మొత్తాన్ని SAR విలువ (నిర్దిష్ట శోషణ రేటు) ద్వారా కొలుస్తారు. ఈ SAR విలువను మొబైల్ లో కోడ్‌ని డయల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
దీని కోసం ఫోన్‌లో *#07# డయల్ చేయాలి.
SAR విలువ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఈ విలువ కిలోగ్రాముకు 1.6 వాట్స్ (W/kg) కంటే ఎక్కువ ఉండకూడదు. చాలా స్మార్ట్‌ఫోన్‌ల SAR విలువ ఈ స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్ SAR విలువ ఈ పరిమితి కంటే ఎక్కువగా ఉంటే అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు.
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి..
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, దాని SAR విలువను కచ్చితంగా చెక్ చేయాలి. SAR విలువ స్థాయి 1.6W/kg వరకు తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఫోన్ రేడియేషన్ నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటే ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించవచ్చు.