Trinamool: తృణమూల్‌లో అంతర్గత పోరు.. వీడియోలు షేర్ చేసిన భాజపా

by Shamantha N |
Trinamool: తృణమూల్‌లో అంతర్గత పోరు.. వీడియోలు షేర్ చేసిన భాజపా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఘర్షణ పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపింది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు, వాట్సప్ చాట్ ను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేయండో వైరల్ గా మారింది. మంగళవారం ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు - కళ్యాణ్ బెనర్జీ, కీర్తి ఆజాద్ మధ్య జరిగిన ప్రైవేట్ వాట్సాప్ చాట్‌లను బీజేపీ పోస్ట్ చేసింది. పార్టీలోని విభేదాలపై వారు గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది. 2024 ఏప్రిల్ 4న ఇద్దరు టీఎంసీ ఎంపీలు భారత ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో బహిరంగంగా గొడవ పడ్డారు. అంతటితో ఆగకుండా, వాట్సప్ లోనూ నలుగురు ఎంపీలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఆ వాట్సప్ స్క్రీన్ షాట్ లను బీజేపీ షేర్ చేసింది. అయితే, టీఎంసీ ఎంపీల చాట్ లో వర్సటైల్ ఇంటర్నేషనల్ లేడీ అనే ప్రస్తావన వచ్చింది. కాగా.. అసలు ఆమె ఎవరు అని ప్రశ్నిస్తూ.. బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ స్కీన్ షాట్ లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

స్పందించిన బీజేపీ

వచ్చే ఏడాది బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ సమయంలో ఘర్షణ జరగడం గమనార్హం. ఎంపీల ఘర్షణపై టీఎంసీ నేత సౌగత రాయ్ స్పందించారు. బీజేపీ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లు మమ్మల్ని సిగ్గుపడేలా, ఇబ్బింకి గురిచేశాయని అన్నారు. ఇలాంటివి జరగవద్దని పేర్కొన్నారు. "ప్రతి పార్టీ అంతర్గత గోప్యతను కాపాడుకోవాలి" అని సౌగత రాయ్ అన్నారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ చర్యలు తీసుకోవాలని కోరారు.



Next Story

Most Viewed