ఈ రోజే మార్కెట్లోకి విడుదలైన Vivo X100 సిరీస్.. ధర, ఫీచర్స్ ఇవే

by Harish |
ఈ రోజే మార్కెట్లోకి విడుదలైన Vivo X100 సిరీస్.. ధర, ఫీచర్స్ ఇవే
X

దిశ, టెక్నాలజీ: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కంపెనీ ఈ రోజు X100 సిరీస్‌ను ఇండియాలో విడుదల చేసింది. దీనిలో X100, X100 Pro మోడల్స్ ఉన్నాయి. ఇవి గురువారం నాడు దేశవ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. అదిరిపోయే ఫీచర్స్‌తో ఇవి మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. జనవరి 11 నుంచి అమ్మకానికి ఉంటాయి. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్లు, ఇతర ఎంపిక చేసిన స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం తగ్గింపులు కూడా లభిస్తాయి.Vivo X100 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 63,999, 16GB RAM + 512GB ధర రూ.69,999. మరో వేరియంట్ X100 Pro 16GB RAM+512GB స్టోరేజ్‌ ధర రూ.89,999. వీటి డిజైన్ కొత్తగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Vivo X100 మోడల్ 6.78 అంగుళాల1.5K, 120Hz కర్వ్డ్ AMOLED స్క్రీన్‌‌ను కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 9300 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 50MP ప్రైమరీ Sony కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్, 64MP కెమెరాలు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది.120W ఫాస్ట్ చార్జింగ్‌‌తో 5,000mAh బ్యాటరీ కూడా ఉంది.

Vivo X100 Pro వేరియంట్ 6.78 అంగుళాల కర్వ్డ్ డిస్‌‌ప్లేను కలిగి ఉంది. Android 14తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 50MP+50MP+50MP కెమెరాలతో వస్తుంది. ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే, 5,400mAh కెపాసిటీ, దీనికోసం 100W వైర్డు ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను అందించారు.


Next Story

Most Viewed