- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విశాఖ నుంచి తిరుపతి వెళ్తున్నారా..? .. మీకో గుడ్ న్యూస్..!

దిశ, వెబ్ డెస్క్: విశాఖ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులు(Passengers), శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం కోసం వాల్తేరు డివిజన్ నుంచి ప్రత్యేక రైలు(Trains)ను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 28 వరకూ ప్రత్యేక రైలు(08583) విశాఖ-తిరుపతి(Viakha to Tiruapati) మధ్య నడవనున్నట్లు సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. ప్రతి సోమవారం రాత్రి 7.10 గంటలకు ఈ రైలు విశాఖ నుంచి బయల్దేరుతుందని, ఆ మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 25 నుంచి ఏప్రిల్ 29 వరకూ కొనసాగుతోందని తెలిపారు. ఈ రైలు ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖకు చేరుతుందని కె. సందీప్ స్పష్టం చేశారు.
కాగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ప్రతి నిత్యం 60 వేలకు మందిపైగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పండుగలు, సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ, రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భక్తుల కోసం టీటీడీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇటు రైల్వే శాఖ కూడా తిరుపతికి ప్రయాణికులు సౌకర్యార్ధం ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక రైలుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.