Vivo నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్.. ఇవే ఫీచర్స్

by Harish |
Vivo నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్.. ఇవే ఫీచర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Vivo నుంచి కొత్త మోడల్ రానుంది. దీని పేరు ‘Vivo V29 Pro’. వచ్చే నెల జూన్‌లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ను Vivo వెబ్‌సైట్‌లో లిస్ట్ చేశారు. దాని ప్రకారం, ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD+ రిజల్యూషన్ (2400 x 1080 పిక్సెల్‌లు) కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 12GB RAM, 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. ప్రధాన కెమెరా 64MP గా ఉంటుంది. ముందు సెల్ఫీల కోసం 50MP కెమెరా ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ పరంగా 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh అందించారు.




Advertisement

Next Story