వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో కొత్త AI ఫీచర్‌..

by Sumithra |   ( Updated:2024-09-13 12:24:53.0  )
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో కొత్త AI ఫీచర్‌..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : వాట్సాప్ మాతృ సంస్థ మెటా త్వరలో తన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు టూ-వే వాయిస్ చాట్ AI ఫీచర్‌ను జోడించనుంది. వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు వాయిస్ చాట్‌లో కొత్త అనుభూతిని పొందుతారని సంస్థ పేర్కొంది.

ఇటీవల వెల్లడించిన నివేదికల ప్రకారం వాట్సాప్ లో రానున్న ఈ కొత్త ఫీచర్ ద్వారా సెలబ్రిటీ వాయిస్‌లను వినియోగించుకునేందుకు అవకాశాన్ని వినియోగదారులకు అందించనుందని తెలిపారు.

మెటా AI వాయిస్ మోడ్..

వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ఇటీవల నివేదిక ప్రకారం AI వాయిస్ ఎంపిక Meta వాయిస్ చాట్ ఫీచర్‌లో అందుబాటులో ఉండనుంది. అలాగే వాట్సాప్‌లో విడుదల కానున్న ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లలో అందుబాటులో ఉందని నివేదికలో తెలిపారు. ఇది త్వరలో OTA ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండనుందని తెలిపారు.

WABetaInfo నివేదిక ప్రకారం వినియోగదారులు WhatsApp AI వాయిస్ ఫీచర్‌లో చాలా మంది ప్రముఖ వ్యక్తుల వాయిస్‌లను ఉపయోగించవచ్చు. WABetaInfo నుండి స్క్రీన్‌షాట్‌లు Meta AI వాయిస్ ఫీచర్ విభిన్న పిచ్, టోనాలిటీ, యాక్సెంట్‌తో విభిన్న స్వరాలను అందజేయనుంది.

ఇక WABetaInfo ప్రకారం వినియోగదారులు WhatsApp AI వాయిస్ ఫీచర్‌లో సెలెక్టివ్ సెలబ్రిటీల వాయిస్‌లను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్‌లో UK, US యాసలో కూడా వాయిస్‌ని ఉపయోగించే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం Meta Messengerలో కస్టమ్ AI చాట్‌బాట్‌ను పరిచయం చేసింది. ఇది సెలబ్రిటీ ప్రొఫైల్‌ను చూపుతుంది.

Advertisement

Next Story

Most Viewed