మరింత నాణ్యతతో Apple Watch డిస్‌ప్లే

by Harish |   ( Updated:2023-07-06 10:19:41.0  )
మరింత నాణ్యతతో Apple Watch డిస్‌ప్లే
X

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ కంపెనీ నుంచి రాబోతున్న Apple Watch Ultra 2nd జనరేషన్ స్మార్ట్ వాచ్ గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ వాచ్‌లో అత్యాధునికమైన డిస్‌ప్లే అందించడానికి మైక్రోLED డిస్‌ప్లేలను తీసుకురానున్నారు. అంతకుముందు యాపిల్ నుంచి Watch Ultra లాంచ్ అయింది. దీని ధర దాదాపు రూ.89,900. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా Ultra 2nd జనరేషన్ స్మార్ట్ వాచ్‌ను 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. యాపిల్ కంపెనీ ఇకమీదట తన అన్ని డిస్‌ప్లేలను మరింత నాణ్యతతో ఇవ్వాలని చూస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా మైక్రోLED డిస్‌ప్లేలను తీసుకొస్తుంది.

మైక్రో LEDలు సాధారణంగా LEDల కంటే వంద రెట్లు చిన్నవిగా ఉంటాయి. వీటిని ఒక డివైజ్‌లో అమర్చడం చాలా కష్టం, అలాగే ఈ ప్రాసెస్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకనే మైక్రోLED ఫీచర్‌ను తీసుకురావడానికి ఎక్కువ సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతానికి మార్కెట్లో మైక్రోLED డిస్‌ప్లేలను అందించడంలో శామ్‌సంగ్ ముందు స్థానంలో ఉంది. అయితే యాపిల్ కంపెనీ ఈ డిస్‌ప్లేల కోసం ఒకే సంస్థపై ఆధారపడుతుంది, దీని కారణంగా ఆ సంస్థపై భారం ఎక్కువగా ఉండి సరఫరా సమస్యలు వస్తున్నాయి. ఈ విషయంలో యాపిల్ తాజాగా ఒకే సంస్థతో కాకుండా మరో సంస్థతో కూడా జట్టు కట్టి సరఫరాను మరింత పెంచుకోవాలని చూస్తుంది.

Advertisement

Next Story