- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆయన ఆచూకీ చెప్పండి.. బహుమతిగా ఇల్లు తీసుకోండి: ఏపీ మాజీ మంత్రి బంపర్ ఆఫర్

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) ఆచూకీ తెలిపితే బహుమతి ఇస్తామని మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Former Minister and Sarvepalli MLA Somireddy Chandramohan Reddy) అన్నారు. మైనింగ్ కేసులో ఆరోపణలు ఎందుర్కొంటూ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కొంతకాలంగా కాకాణి అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ విచారణకైనా రెడీ అని, తాను ఎక్కడికి వెళ్లేది లేదని సవాల్ విసరడాన్ని ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుపట్టారు. ఆయనపై సెటైర్లు వేస్తూ విమర్శలు కురిపించారు. తాను ఎక్కడికీ పోలేదని, ఇక్కడే ఉన్నానని కాకాణి చెప్పారని, ఇప్పుడు ఆయనను ఒక్కసారి చూడాలని ఉందని వ్యాఖ్యానించారు.. తప్పు చేయకపోతే కాకాణి ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలని సోమిరెడ్డి సూచించారు.
‘‘కాకాణి ఎక్కడున్నారో అడ్రస్ లేరు.. ఎవరైనా ఆయన ఆచూకీ తెలిపితే.. కరోనా హౌస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చేస్తాం. కాకాణి పిరికిపంద. ఫేక్ డాక్‌మెంట్ల కేసులో రెండు నెలలు పారిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. జగన్ మోహన్ రెడ్డికి ఏ మాత్రం మానవత్వం ఉన్నా.. అసభ్యంగా మాట్లాడినప్పుడు వల్లభనేని వంశీని సస్పెండ్ చేయాల్సింది. ఆ పని ఆయన చేయలేదు. జగన్ ఫ్యామిలీపై అసభ్యంగా మాట్లాడితే ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌పై కేసు పెట్టి జైలుకు పంపాం. తల్లిదండ్రులను, ఇంట్లో వాళ్లను తిట్టిన వల్లభనేనిని, కాకాణి గోవర్ధన్ రెడ్డిపై యాక్షన్ తీసుకుని ఉంటే జగన్‌కు ఇంకో నాలుగైదు సీట్లు ఎక్కువ వచ్చి ఉండేవి. పనిమాలిన గుణాలు ఉన్నవారిని జగన్ ప్రోత్సహించారు. వెనకేసుకొచ్చారు. ఇప్పుడు వాళ్లు జైలు పాలవుతున్నారు. ఇప్పటికే జైలు పాలైన వారిని జగన్ పరామర్శించి బయటకు వచ్చి పోలీసులను బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో పని చేసి జగన్ ఇలా దిగజారిపోతారని మేం అనుకోలేదు. కాకాణి ఎక్కడున్నారో చెప్పారు. కలుగులో ఉన్న కాకాణిని దర్శనం చేసుకోవాలని ఉంది. కాకాణి ప్రతి రోజూ నన్ను తిట్టారు. నీతో తిట్టించుకోవాలి. ఎక్కడున్నావో రా.. నువ్వు తిట్టకపోతే నాకు నిద్రపట్టంలేదు.’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు.
కాకాణి ఆచూకీ తెలిపిన వారికి భారీ బహుమతి pic.twitter.com/RqroMFByYm
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) April 18, 2025