- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
PM Modi: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోడీ

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచదేశాలపై అమెరికా టారీఫ్ ల మోత మోగిస్తున్న భారత్- యూఎస్ మద్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి వేళ మరో కీలక పరిణామం జరిగింది. ప్రపంచ బిలియనీర్, డోజ్ విభాగ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk)తో భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఫోన్‌లో చర్చలు జరిపారు. ‘‘టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడా. ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్‌లో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలనూ మేం ప్రస్తావించాం. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించాం. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది’’ అని మోడీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
స్టార్ లింక్..
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సంస్థలు భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇలాంటి సమయంలో వీరి మధ్య సంభాషణకు ప్రాధాన్యం సంతరించికుంది. మరోవైపు, భారత్ లోకి స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ఒప్పందం చేసుకున్నాయి. అయితే, స్టార్‌లింక్‌కు భారత్ ఇంకా అనుమతులు మంజూరు చేయలేదు. ఈ క్రమంలోనే ఆ సంస్థ ప్రతినిధుల బృందంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల సమావేశమయ్యారు. స్టార్‌లింక్‌కు ప్రస్తుతమున్న భాగస్వామ్యాలు, భారత్‌లో భవిష్యత్ పెట్టుబడులు ప్రణాళికపై చర్చలు జరిపారు. ఇకపోతే, మస్క్ స్టార్‌లింక్ కు 7 వేలకంటే ఎక్కువ క్రియాశీల ఉపగ్రహాలు భూమి చుట్టూ కక్ష్యలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 4.6 మిలియన్ల మందికి అత్యంత వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సర్వీసుని అందిస్తున్నాయి. అయితే, మస్క్ భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించాలనుకుంటే రోజుకు ఒక బిలయన్ కంటే ఎక్కువ ఇంటర్నెట్ యాక్టివ్ కనెక్షన్లు ఉండాలి. అంతేకాకుండా, స్టార్ లింక్ అధిక ధర కూడా ఒక సమస్యగా మారే ఛాన్స్ ఉంది. మరోవైపు, భారత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువ ధరకే మొబైల్ డేటాను అందిస్తున్న దేశంగా నిలిచింది.