విశ్వం త్వరలో ముగియనుందా.. శాస్త్రవేత్తల పరిశోధనలో భయానక నిజాలు..

by Sumithra |
విశ్వం త్వరలో ముగియనుందా.. శాస్త్రవేత్తల పరిశోధనలో భయానక నిజాలు..
X

దిశ, ఫీచర్స్ : సూర్యుడు ఇప్పటికే తన జీవితాన్ని సగం పూర్తి చేసుకున్నాడు. సూర్యుడు దాదాపు 5 బిలియన్ సంవత్సరాలకు నాశనం అవుతాడు. సూర్యుడు లేనప్పుడు భూమి పై సూర్యుడు లేనప్పుడు విశ్వం అంధకారంలోకి వెళ్లిపోయి, భూమి మీద జీవరాశి లేకుండా పోతుంది. అలా భూమి కూడా నాశనమైపోతుందని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సైంటిస్టులు చేసిన కొత్త పరిశోధనలో మరికొన్ని షాకింగ్, భయాందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వం నెమ్మదిగా నాశనమవుతోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారని చెబుతున్నారు. ఏదో ఒకరోజు పెద్ద సంక్షోభంతో సూర్యుడు, భూమి జీవితకాలం ముగుస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

కొలంబియా యూనివర్సిడాడ్ ECCI మాజీ సభ్యుడు లజ్ ఏంజెలా గార్సియా ఈ విషయాన్ని ధృవీకరించారు. శాస్త్రవేత్తల బృందం డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఉపయోగించి సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నారు. ఈ డేటా ద్వారా శాస్త్రవేత్తలు విశ్వానికి సంబంధించిన లోతైన మ్యాప్‌ను రూపొందించారు. ఈ మ్యాప్ ద్వారా ఏంజెలా గార్సియా విశ్వంలోని చీకటి శక్తి కాలక్రమేణా తగ్గుతోందని ధృవీకరించింది.

విశ్వంలో పెద్ద సంక్షోభం..

భూమి, సూర్యుడు ఎలా ఆగిపోతాయో ఇప్పటికే తేలిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా సూర్యుని గురించి, అది 5 బిలియన్ సంవత్సరాల తర్వాత నాశనం అవుతుందని చెప్పారు. సూర్యుడు విస్పోటనం చెందే ముందు అది భయంకరమైన ఎర్రటి నక్షత్రంగా మారుతుందిని చెబుతున్నారు. ఇప్పుడు విశ్వం గురించిన ఈ రిపోర్ట్ షాకింగ్ గా ఉంది. నిరంతర బలహీనత కారణంగా విశ్వంలో పెద్ద సంక్షోభం ఏర్పడుతుందని, ఇది దాని విధ్వంసంతో మాత్రమే ముగుస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ప్రపంచ భవిష్యత్తు అంధకారం..

పరిశోధనలో నిమగ్నమైన శాస్త్రవేత్తల ప్రకారం విశ్వం నాశనం కావడానికి ఇంకా మిలియన్ల సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. అయితే డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్‌ పై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ప్రపంచ భవిష్యత్తు అస్పష్టంగా ఉందని హెచ్చరించారు. శాస్త్రవేత్తల ప్రకారం, విశ్వం వేగంగా విస్తరిస్తోంది. అందువల్ల, అణువులను ఏర్పరిచే దాని శక్తి నిరంతరం బలహీనపడుతోంది.

నెమ్మదిగా నాశనం అవుతుంది

డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్‌స్ట్రుమెంట్ నుండి వచ్చిన డేటా అధ్యయనాల ఆధారంగా, ECCIలో కాస్మోలాజిస్ట్, DESI బృందం మాజీ సభ్యుడు లుజ్ ఏంజెలా గార్సియా పెనాలోజా, డార్క్ ఎనర్జీ ప్రభావం కాలక్రమేణా తగ్గుతోందని ధృవీకరించారు. స్పేస్.కామ్‌తో గార్సియా పెనాలోజా మాట్లాడుతూ ఒక రోజు విశ్వం విస్తరణ ఆగిపోతుంది. అది గురుత్వాకర్షణ ప్రభావంతో రావడం ప్రారంభిస్తుంది. చివరికి విశ్వం అంతం అవుతుందంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed