AI: వాటితో కాల్ సెంటర్లకి ముప్పు తప్పదా..? సంచలన విషయాలు వెళ్లడించిన TCS సీఈఓ

by Disha Web Desk 3 |
AI: వాటితో కాల్ సెంటర్లకి ముప్పు తప్పదా..? సంచలన విషయాలు వెళ్లడించిన TCS సీఈఓ
X

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం సాంకేతిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది మనిషి చేయాల్సిన ప్రతి పని కూడా నేడు మిషన్లే చేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ ఆవిష్కరణ సాంకేతిక రంగంలో ఒక మైలురాయి అని చెప్పొచ్చు. అయితే పెరిగిన సాంకేతికత మనిషి మనుగడకు ముప్పుగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ఏఐ సేవలు అందుబాటులోకి రావడంతో చాలామంది వాటిపైనే ఆధారపడుతున్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఏఐ ప్రతిపని చేస్తుండడం వల్ల మనిషి చిన్నపనికి కూడ వాటిపైనే ఆధాపడడం కారణంగా ఆలోచనా శక్తిని కోల్పోతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అలానే అని రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా తగ్గుతాయని పేర్కొంటున్నారు. తాజాగా ఇదే విషయంపై టీసీఎస్ సీఈవో కృతివాసన్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కాల్ సెంటర్ల భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏఐ కాల్ సెంటర్ల పైన ఎంత ప్రభావం చూపనున్నాయి అంటే.. వచ్చే ఏడాది లోపల కాల్ సెంటర్ అవసరమే లేకుండా పోయే పరిస్థితులు వచ్చినా రావచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.

అధునాతన చాట్‌బాట్‌లు కస్టమర్ల లావాదేవీలను విశ్లేషించి కాల్ సెంటర్లో ఏజెంట్లు అవసరం తగ్గిస్తాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఏఐ ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని, దీనితో భవిష్యత్తులో ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుందని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed