Sunita Williams : మరోసారి స్పేస్ వాక్ చేసిన సునీతా విలియమ్స్

by M.Rajitha |
Sunita Williams : మరోసారి స్పేస్ వాక్ చేసిన సునీతా విలియమ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : నాసా వ్యోమగామి(NASA Astronaut) సునీతా విలియమ్స్(Sunita Williams) నేడు మరోసారి స్పేస్​వాక్ చేశారు. ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్(ISS) నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ యాంటెన్నా అసెంబ్లీని తొలగించడం. దీనితో పాటు సునీతా, విల్మోర్‌కు ఆర్బిటల్ అవుట్‌పోస్ట్‌లో సూక్ష్మజీవులను కనుక్కోవడం ఈ స్పేస్ వాక్ ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రస్తుత కమాండర్ సునీతా విలియమ్స్ తన తోటి ఆస్ట్రోనాట్, ఫ్లైట్ ఇంజనీర్ బారీ విల్మోర్‌తో కలిసి మరోసారి ISS నుంచి వెలుపలికి రానున్నారు. ఇది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా చేపట్టిన 92వ స్పేస్​వాక్. కాగా సునీతా జనవరి 16, 2025న చేసిన 8వ స్పేస్‌వాక్‌లో అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా వ్యోమగామి నిక్‌ హేగ్‌తో కలిసి అంతరిక్ష కేంద్రానికి కొన్ని మరమ్మతులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పుడు తన కెరీర్​లో 9వ స్పేస్‌వాక్ అంటే ఎక్స్‌ట్రా-వెహికల్ యాక్టివిటీ (EVA) చేయబోతున్నారు. దీంతో గతేడాది జూన్‌లో ISSలోకి వచ్చినప్పటి నుంచి విలియమ్స్ స్పేస్​స్టేషన్​ నుంచి వెలుపలికి రావడం ఇది రెండోసారి కానుంది.

అయితే సునీతా విలియమ్స్ తొమ్మిదోసారి చేయనున్న స్పేస్​వాక్​ను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష ప్రేమికులు, శాస్త్రవేత్తలు, ఆస్ట్రోనాట్స్ లైవ్ లో వీక్షించారు. గత ఏడాది జూన్ 6న బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో సునీత, మరో ఆస్ట్రోనాట్ బుచ్‌ విల్‌మోర్‌ ISSకు చేరుకున్నారు. వాస్తవానికి వారం రోజుల్లో అంటే అదే నెల 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉంది. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వీరిద్దరూ గత ఏడు నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్​ సెంటర్​లోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఈ ఇద్దరు వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump) తమ సాయం కోరినట్లు 'స్పేస్‌ ఎక్స్‌' అధినేత ఎలాన్‌ మస్క్‌(Elon Musk) తెలిపారు. త్వరలో ఈ పని పూర్తిచేస్తామని 'ఎక్స్‌'లో పోస్ట్​ ద్వారా మస్క్ వెల్లడించారు.



Next Story

Most Viewed