Search GPT Vs Google: గూగుల్ సెర్చ్ ఇంజిన్ కథ కంచికేనా..! దూసుకొస్తున్న సెర్చ్ జీపీటీ

by Shiva |
Search GPT Vs Google: గూగుల్ సెర్చ్ ఇంజిన్ కథ కంచికేనా..! దూసుకొస్తున్న సెర్చ్ జీపీటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గూగుల్’ సగటు మనిషికి ఎలాంటి సమాచారాన్ని అయినా ఖచ్చితత్వంతో పూర్తి సమాచారాన్ని చిటికెలో అందిస్తున్న సెర్చ్ ఇంజిన్. ప్రస్తుతం ఆ సెర్చ్ ఇంజిన్‌కు త్వరలోనే కొత్త టెక్నాలజీలో రూపంలో పోటీ ఎదురుకాబోతోంది. చాట్‌బాట్‌కు ఏఐ టెక్నాలజీని యాడ్ చేసి చాట్ జీపీటీ రూపొందించిన టెక్ సంస్థ ఓపెన్ ఏఐ ఇప్పుడు సరికొత్త సెర్చ్ ఇంజిన్‌ను ఆవిష్కరించింది. దాని పేరే సెర్చ్ జీపీటీ. సెర్చ్ ఇంజిన్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గూగుల్‌కు పోటీగా ఓపెన్ ఏఐ కొత్త సెర్చ్ ఇంజిన్‌‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం సెర్చ్ జీపీటీ డెవెలప్‌మెంట్ స్టేజ్‌లో ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సెర్చ్ జీపీటీ ఏఐ టెక్నాలజీ సాయంతో కోరిన డేటా రియల్ టైంలో యూజర్ల ముందు ప్రత్యక్ష్యం కానుంది. ఈ క్రమంలో గూగుల్, సెర్చ్ జీపీటీ ఇచ్చే పోటీని తట్టుకుని నిలబడుతుందా.. లేక ఓటమిని ఒప్పుకుంటుందా వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story

Most Viewed