Realme ‘Narzo N53’ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇదే ఆ తేదీ!

by Harish |   ( Updated:2023-05-11 13:27:11.0  )
Realme ‘Narzo N53’ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇదే ఆ తేదీ!
X

దిశ, వెబ్‌డెస్క్: Realme నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ‘Narzo N53’ భారత్‌లో లాంచ్ కానుంది. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, మే 18న మధ్యాహ్నం 12 గంటలకు దేశంలో విడుదల అవుతుంది. అమెజాన్‌లో సేల్‌కు సంబంధించిన విషయాన్ని కంపెనీ ప్రకటించింది. ఇది 4GB RAM + 64GB స్టోరేజ్, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ 6.72 అంగుళాల డిస్‌ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్‌తో రానుంది. MediaTek Helio G80 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. Android v13 తో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 MP + 2 MP కెమెరాలు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 8 MP కెమెరా ఉంది. ఫోన్‌లో 33W ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 mAh బ్యాటరీని అందించారు. బేస్ వేరియంట్ ధర రూ. 10,999 గా ఉండే అవకాశం ఉంది.




Advertisement

Next Story