మార్కెట్లోకి విడుదలైన OnePlus ట్యాబ్

by Harish |   ( Updated:2023-10-06 11:25:22.0  )
మార్కెట్లోకి విడుదలైన OnePlus ట్యాబ్
X

దిశ, వెబ్‌డెస్క్: OnePlus కంపెనీ కొత్తగా ట్యాబ్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘వన్‌ప్లస్ ప్యాడ్ గో’. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999. ఇదే స్టోరేజ్‌లో LTE వేరియంట్ ధర రూ.21,999. అక్టోబర్ 12 నుంచి ముందస్తు బుకింగ్‌లకు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 20 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్లతో పాటు ఎంపిక చేసిన స్టోర్లలో నేరుగా కొనుగోలుకు లభిస్తుంది. ముందస్తు బుకింగ్ చేసుకునే వారికి రూ.2 వేలు ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఉంటుంది.

వన్‌ప్లస్ ప్యాడ్ గో టాబ్లెట్‌11.35-అంగుళాల 2.4K (2408 x 1720 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత OxygenOS 13.2 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతుంది. MediaTek Helio G99 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ట్యాబ్ ముందు, వెనక 8-మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌తో 8,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే Dolby Atmos క్వాడ్ స్పీకర్లను కూడా దీనిలో అందించారు.

Advertisement

Next Story