OnePlus నుంచి కొత్త ఇయర్‌బడ్స్ .. ధర ఎంతంటే..!

by Harish |   ( Updated:2023-07-06 12:26:05.0  )
OnePlus నుంచి కొత్త ఇయర్‌బడ్స్ .. ధర ఎంతంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: OnePlus కంపెనీ కొత్తగా ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో బుధవారం విడుదల చేసింది. వీటి పేరు ‘Nord Buds 2R’. ఇవి వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్. దీని ధర రూ. 2,199. కంపెనీ వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా అమ్మకానికి ఉన్నాయి. ఇది డీప్ గ్రే, ట్రిపుల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. Nord Buds 2R చెవులకు కరెక్ట్‌గా సరిపోతుంది. వీటిలో 12.4mm డైనమిక్ డ్రైవర్‌లను అందించారు. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసి మంచి సౌండ్ అనుభూతిని అందిస్తాయి. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉన్నాయి.


కంపెనీ AI క్లియర్ టెక్నాలజీ కారణంగా కాల్స్ మాట్లాడే సమయంలో పరిసరాల నుంచి సౌండ్స్, ఎలాంటి డిస్టబెన్స్ ఉండదని కంపెనీ తెలిపింది. చార్జింగ్ కేసు USB టైప్-C పోర్ట్‌ను అందించారు. చార్జింగ్ కేస్‌లో 480mAh, ప్రతి బడ్స్‌లో 36mAh బ్యాటరీని అమర్చారు. 8 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌, చార్జింగ్ కేస్‌తో అదనంగా 30 గంటల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ పేర్కొంది. ఇయర్‌బడ్స్ చెమట, నీటి నిరోధకత కోసం IP55 రేటింగ్‌ను కలిగి ఉంది.

Advertisement

Next Story