- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు ఇండియాలోకి OnePlus ‘Buds 3’.. ధర రూ.5,499
దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన OnePlus కంపెనీ నుంచి కొత్త మోడల్ TWS ‘Buds 3’ విడుదలయ్యాయి. ఇది మెటాలిక్ గ్రే, స్ప్లెండిడ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ధర రూ.5,499. వన్‌ప్లస్ వెబ్‌సైట్, అమెజాన్, రిటైల్ స్టోర్‌ల ద్వారా ఫిబ్రవరి 6 నుండి అమ్మకానికి ఉంటాయి. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తగ్గింపులు కూడా ఉన్నాయి. OnePlus బడ్స్ 3 మోడల్ 10.4mm వూఫర్ 6mm ట్వీటర్‌తో డ్యూయల్ డ్రైవర్ సెటప్‌ను కలిగి ఉంది. కాల్స్ మాట్లాడే సమయంలో బయటి సౌండ్ వినిపించకుండా ఉండటానికి 49dB వరకు అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందించారు.
కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం,ఇవి జపాన్ ఆడియో సొసైటీ (JAS) సర్టిఫికేట్ పొందిన Hi-Res సౌండ్‌కు సపోర్ట్ చేస్తాయి. వాల్యూమ్‌ని అడ్జస్ట్ చేయడానికి టచ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. ప్రతి ఇయర్‌ఫోన్‌లో 58mAh బ్యాటరీ, చార్జింగ్ కేస్‌లో 520mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ANC ఆన్ చేస్తే 6.5 గంటల ప్లేబ్యాక్, చార్జింగ్ కేసుతో 28 గంటల ప్లేబ్యాక్ టైం వస్తుంది. అదే ANCని ఆపివేస్తే 10 గంటల ప్లేబ్యాక్, చార్జింగ్ కేసుతో 44 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ తెలిపింది. కేవలం 10 నిమిషాల చార్జింగ్‌తో 7 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. చార్జింగ్ పోర్ట్ USB టైప్-C. ఇది దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP55 రేటింగ్‌ను కలిగి ఉంది.