వాట్సాప్‌లో కొత్త ఫీచర్ ప్రకటించిన మెటా.. కమ్యూనిటీలో ఈవెంట్‌ ప్లాన్ చేయవచ్చు

by S Gopi |
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ ప్రకటించిన మెటా.. కమ్యూనిటీలో ఈవెంట్‌ ప్లాన్ చేయవచ్చు
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు మెటా ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. వాట్సాప్ కమ్యూనిటీల కోసం ఈ సదుపాయం పరిచయం చేస్తున్నట్టు తెలిపింది. గ్రూప్ మెసేజ్‌లలో ఈవెంట్‌లను ప్లాన్ చేయడమే కాకుండా స్నేహితులు, సన్నిహితులు, స్కూళ్లు వర్చువల్, వ్యక్తిగత సమావేశాలను నిర్వహించేందుకు ఈ కొత్త ఫీచర్ మరింత సులభతరం చేస్తుంది. వాట్సాప్‌లోని ఈవెంట్స్ ఫీచర్ ద్వారా గ్రూప్ సభ్యుల వర్క్ మీటింగ్‌లు, పుట్టినరోజు పార్టీలను సెటప్ చేసేందుకు వీలుంటుంది. కొత్తగా జరగబోయే ఈవెంట్ సమాచారం గురించి గ్రూప్ ఇన్ఫర్మేషన్ పేజీకి పిన్ చేయబడి ఉంటుంది. తద్వారా గ్రూప్ చాట్ థ్రెట్ క్రియేట్ అవడం, ఎవరెవరికి మెసేజ్ చేరిందనే విషయం తెలుసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఎవరైనా సభ్యులు ఈవెంట్‌కు వస్తున్నట్టు రిప్లై ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. దానివల్ల ఈవెంట్ సమయంలో నోటిఫికేషన్ అందుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ కమ్యూనిటీలోనే ఉందని, రాబోయే నెలల్లో వాట్సాప్ గ్రూప్‌లలోనూ అందించనున్నట్టు మెటా వెల్లడించింది.

Advertisement

Next Story