ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతిపెద్ద ముప్పుగా మారబోతుందా..? మానవుల అంతానికే అడుగులు పడుతున్నాయా..?

by Sumithra |
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతిపెద్ద ముప్పుగా మారబోతుందా..? మానవుల అంతానికే అడుగులు పడుతున్నాయా..?
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దీని గురించి ప్రతినిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఏఐ ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయని కొంతమంది నిపుణుల అభిప్రాయం. అంతే కాదు AI అందుబాటులోకి వచ్చినప్పటి నుండి తమ ఇన్ఫర్మేషన్ భద్రతకు సంబంధించిన అనే ప్రశ్నలు ప్రజల మనస్సును అతలాకుతలం చేస్తున్నాయి. అంతే కాదు ఏఐ మానవాళికి కూడా ముప్పుగా మారుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. AI ని దుర్వినియోగం చేస్తే వినాశనానికి దారితీస్తుందని చెబుతున్నారు. అందుకే అనేక దేశాలు ఇప్పుడు కృత్రిమ మేధస్సును సురక్షితంగా ఎలా వినియోగించాలో చెబుతున్నాయి ?

US ఈ దిశలో మొదటి అడుగు వేసింది. మార్చి 11, 2024న ప్రచురించిన ఓ నివేదిక డిఫెన్స్ ఇన్ డెప్త్: యాన్ యాక్షన్ ప్లాన్ టు ఇంక్రీజ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ AI, గ్లాడ్‌స్టోన్ చేత తయారు చేశారు. యుఎస్ ప్రభుత్వం ఈ నివేదికలో AI కారణంగా, భవిష్యత్తులో మానవ ఉనికి పూర్తిగా అంతరించిపోతుందని చెబుతున్నాయి.

AI వినాశకరమైనది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిందని. అయితే భవిష్యత్తులో AI పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టిస్తోందని నివేదికల్లో పేర్కొన్నారు. ఫ్రాంటియర్ ల్యాబ్ ప్రపంచంలోని అత్యంత అధునాతన AI వ్యవస్థను రూపొందించడానికి పని చేస్తోందని వెల్లడించింది. ఫ్రాంటియర్ ల్యాబ్ అనేది అధునాతన AI సిస్టమ్‌లను రూపొందించడానికి పనిచేసే సంస్థ. ఉదాహరణకు : OpenAI, Google DeepMind, Anthropic మొదలైనవి.

దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా AI ముప్పు..

ఈ ల్యాబ్ ఈ దశాబ్దం చివరి నాటికి లేదా అంతకంటే ముందుగానే మానవ స్థాయి, మానవాతీత కృత్రిమ మేధస్సును సాధించాలనే ఉద్దేశాన్ని బహిరంగంగా ప్రకటించింది. AI ప్రమాదాల పరిధి ప్రపంచవ్యాప్తంగా, వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే AIని ఎంత జాగ్రత్తగా వినియోగించే రక్షణా చర్యలను ప్రవేశపెట్టడం ద్వారా ఈ నష్టాలను పరిష్కరించగలరని చెబుతున్నారు.

AIతో పొంచి ఉన్న ప్రమాదాలు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి కారణంగా భవిష్యత్ AI వ్యవస్థ చాలా సామర్థ్యం కలిగి ఉండవచ్చు. దాని ప్రభావం మానవాళికి ముప్పుగా పరిణమిస్తుంది.

నివేదికలో ఈ విషయాల పై దృష్టి సారించారు..

అధునాతన AI సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని నివేదిక నొక్కి చెప్పింది. అలాగే విధానం, చట్టంలో అధునాతన AI భద్రతా చర్యలను చేపట్టాలి.

మొత్తం మీద AI చాలా ఉపయోగకరమైన విషయం కానీ దానిని నియంత్రించడం చాలా ముఖ్యం. లేకుంటే అది విధ్వంసానికి కారణం కావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి భద్రతా విధానం పై పని చేయాలి, తద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను నివారించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed