- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
RBI: కీలక వడ్డీ రేట్లను మరోసారి సవరించిన ఆర్బీఐ.. 0.25 శాతం తగ్గిన రెపోరేటు

దిశ, నేషనల్ బ్యూరో: మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. కాగా.. కీలక వడ్డీ రేట్లను మరోసారి సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటు(Repo Rate) ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెపో రేటుని 0.25 శాతం తగ్గించినట్లు పేర్కొన్నారు. దీంతో, రెపోరేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. అయితే, తగ్గింపు నిర్ణయానికి ‘మానిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee)’ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. వడ్డీరేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. కాగా.. గతేడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
4 శాతం కంటే తక్కువగా ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా పడిపోయి ఆర్థిక వృద్ధి మందగించడంపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలో ఈ చర్య రావడం గమనార్హం. డిమాండ్‌కు మద్దతు ఇవ్వడానికి, పెట్టుబడికి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది. ఇకపోతే, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ(SDF) రేటును 5.75శాతానికి సర్దుబాటు చేశారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును (MSF) 6.25 శాతానికి సవరించారు. అయితే, తటస్థ వైఖరి నుంచి సర్దుబాటు విధానానికి మరాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. "స్టాక్‌ను తటస్థం నుండి సర్దుబాటుకు మార్చాలని నిర్ణయించాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి, ఆర్థిక దృక్పథాన్ని నిరంతరం పర్యవేక్షించడం, అంచనా వేయడం అవసరమని గుర్తించాం" అని ఆర్బీఐ(RBI) గవర్నర్ అన్నారు.