తుర్కయంజాల్‌లో ఘర్షణ వాతావరణం.. బస్ అద్దాలు ధ్వంసం

by Mahesh |
తుర్కయంజాల్‌లో ఘర్షణ వాతావరణం.. బస్ అద్దాలు ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్, రంగారెడ్డి బ్యూరో: హైదరాబాద్ నగరంలోని తుర్కయంజాల్ మున్సిపల్ (Turkmenbashi Municipality) పరిధిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం (ఉద్రిక్త వాతావరణం) నెలకొంది. పాట్ల విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరమీదకు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని కమ్మగూడ సర్వేనెంబర్ 241, 242, 243, 245 లో ఉన్న ప్లాట్ల వద్ద ఈ వివాదం నెలకొంది. పలువురు భూ కబ్జాదారులు మెహదీపట్నం నుంచి మహిళలను బస్సులో తీసుకొచ్చి.. తమ ప్లాట్లలో నివాసం ఉంటున్నారని ప్లాట్ యజమానులను బెదిరించడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలో వారిని ప్లాట్ల యజమానులు అడ్డుకున్నారు. తాము గత 20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నామని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓపెన్ ప్లాట్‌ల తాత్కలిక గోడలను కులుస్తుండగా అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. దీంతో పాట్ల యజమానులు, అక్కడే నివాసం ఉంటున్న వారు.. బస్ అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే బెదిరించడానికి వచ్చిన వారి పలు బైక్ లకు ప్లాట్ ఓనర్లు నిప్పు పెట్టారు. కమ్మగూడ సర్వే నెంబర్ 240 లోని 10 ఎకరాల భూమి విషయంలో వివాదంలో ఇరు వర్గాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ప్లాట్స్ ఓనర్స్, పట్టదారులకు మధ్య కొనసాగుతున్న భూ వివాదం కోర్టులో కొనసాగుతుంది.



Next Story

Most Viewed