iQoo నుంచి రాబోతున్న మరో కొత్త స్మార్ట్ ఫోన్!

by Harish |
iQoo నుంచి రాబోతున్న మరో కొత్త స్మార్ట్ ఫోన్!
X

దిశ, వెబ్‌డెస్క్: iQoo కంపెనీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ మోడల్ పేరు ‘iQoo Neo 7 Pro 5G’. ఇది గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో విడుదలయింది. ఇప్పుడు భారత్‌లో జులై నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీని ధర రూ. 36,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఫోన్ ఫీచర్స్ గురించి అందిన వివరాల ప్రకారం, ఇది 6.78-అంగుళాల 1.5K AMOLED ఫుల్-HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.



Adreno 730 GPUతో Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 16GB RAM, 256GB స్టోరేజ్‌ ఉండనుంది. ఆపరేటింగ్ సిస్టం Android 13-ఆధారిత Funtouch OS 13పై రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50MP+8MP+2MP కెమెరాలు, ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా అందించనున్నారు. ఫోన్ 120W వైర్డు ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Advertisement

Next Story