Gmail మెసేజ్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రిప్లై

by Harish |
Gmail మెసేజ్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రిప్లై
X

దిశ, టెక్నాలజీ: దిగ్గజ కంపెనీ గూగుల్‌ తన జీమెయిల్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను ఉపయోగిస్తుంది. తన జెమినీ అల్ట్రా AI మోడల్‌ను జీమెయిల్‌లో వచ్చే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం, డ్రాఫ్ట్ చేయడం వంటి వాటికి ఉపయోగపడేలా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. యూజర్లు తమ Gmailలో ఏదైనా మెసేజ్‌కు రిప్లై ఇచ్చే సమయంలో బాక్స్‌కు ఎగువన కొత్త ప్యానెల్‌ను క్లిక్ చేయగానే జెమినీ AI రిప్లై ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఆ మెసేజ్‌లకు అనుగుణంగా ఆటోమెటిక్‌గా జెమినీ అల్ట్రా AI మోడల్‌ తిరిగి సమాధానాలు చూపిస్తుంది. వాటిలో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకుని సెండ్ చేయవచ్చు. యూజర్లు మెసేజ్‌ రిప్లైల కోసం తిరిగి సమాధానాలను పూర్తిగా రాయాల్సిన అవసరం ఉండదు. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది. PiunikaWeb నివేదిక ప్రకారం, అతి త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. Google One AI ప్రీమియం ప్లాన్ ద్వారా Gmail, Docs, Slides, Sheets, Meet with Gemini అడ్వాన్స్‌డ్‌లో AI ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతించడం ద్వారా Google Workspace యాప్‌లలో Gemini Ultraని ఏకీకృతం చేస్తున్నట్లు ఫిబ్రవరిలో గూగుల్‌ ప్రకటించింది.



Next Story

Most Viewed