‘వింతనిపించినా.. వీడియో గేమ్ ఆడగలదు’

by Aamani |   ( Updated:2023-03-23 15:29:15.0  )
‘వింతనిపించినా.. వీడియో గేమ్ ఆడగలదు’
X

దిశ, వెబ్‌డెస్క్ : మనుషులు తలచుకుంటే కోతులతో కుప్పి గంతులు వేయించోచ్చు. కర్ర సాము, కత్తి సాములతో విన్యాసాలు చేయించొచ్చు. కానీ మనిషిలా ఆలోచించగలవా..? వీడియో గేములు ఆడి వింతలు సృష్టించగలవా..? అనే ప్రశ్నలకు సరికొత్త సమాధానం చెప్పబోతున్నాడు టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్. నూతన ఆవిష్కరణలతో తనదైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇతను న్యూరాలింక్ అనే శాస్త్ర సాంకేతిక ప‌రిజ్ఞానానికి సంబంధించిన సంస్థను స్థాపించారు. ఈ సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోని పరిశోధనలు కొనసాగిస్తోంది. అలాంటి ఒక సరికొత్త ప్రయోగమే కోతి వీడియో గేమ్ ఆడటం.

మర్కటము మనలా ఆడగలదు..

అవును. ఈ సంస్థ చేసిన ప్రయోగం ఫలితమే కోతి మనిషిలా ఆలోచించగలగడం. ఇందులో భాగంగానే ఓ చిన్న చిప్‌ని కోతి మెదడుకు అమర్చారు. దీని సహాయంతో కోతి మెదడుకి సిగ్నల్స్ వెళ్తాయి. వాటి ఆధారంగానే కోతి పాంగ్ అనే గేమ్ ఆడతుందని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు ఎలన్ మస్క్.

ఈ ఆలోచన అప్పటిదే..

పూర్వంలో అంగ వైకల్యం కలిగిన వారికి పనిముట్లు అమర్చేవారు. వీటి సహాయంతో వారు అందరిలాగే ఏ పనైనా వేగంగా చేయగలిగేవారు. ఇలాంటి ప్రక్రియ ద్వారానే ఈ ఆలోచన వచ్చిందని వివరించారు. అలాగే ఎవరైనా పక్షవాతం బారిన పడితే అలాంటి వారు వేగంగా స్మార్ట్ ఫోన్ వాడే సదుపాయం కల్పిస్తామని ఎలన్ మస్క్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఈ కోతి పేరేంటో తెలుసా..?

మకాక్ జాతికి చెందిన ఈ తొమ్మిదేళ్ల కోతి పేరు పాజెర్. మెదడుకి చిప్ అమర్చడం ద్వారా ఈ కోతి మనిషిలా వీడియో గేమ్ ఆడగలుగుతుంది. పాంగ్ అనే గేమ్‌లో జాయ్ స్టిక్‌ని ఎలా కదిపితే నెగ్గుతామో చిప్ ద్వారా తెలుసుకోని అలాగే కదిలిస్తుంది. దాదాపు ఆరు వారాలుగా కోతి ఈ గేమ్ ఆడుతున్నట్లు సమాచారం.

పరిశోధన ప్రధాన ఉద్దేశం ఏమిటి..?

అల్జీమర్స్ తదితర సమస్యలు ఉన్నవారు నాడీ సంబంధిత సమస్యలను అధిగమించేదుకు న్యూట్రాలింక్ సంస్థ బ్రెయిన్ చిప్‌లు తయారు చేసే పనిలో ఉంది. అందులో భాగంగానే కోతిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తే మనుషులపై వాడనున్నారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రయోజనకర పరిశోధనలు చేస్తామని ఈ సందర్భంగా ఎలన్ మస్క్ వెల్లడించారు.

Also Read...

Smart Tv: స్మార్ట్ టీవీ క్లీన్ చేసే సమయంలో ఈ తప్పులను చేయకండి?

Advertisement

Next Story

Most Viewed