- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
15 రోజుల్లో పంట దిగుబడిని రెట్టింపు చేసే ఎలక్ట్రానిక్ మట్టి.. ఎలా తయారువుతుందో తెలుసా ?
దిశ, ఫీచర్స్ : శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయోగాన్ని చేస్తూ కొత్త కొత్త విషయాలను కనుగొంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మట్టిని అంటే eSoil ను అభివృద్ధి చేశారు. ఈ నేల వ్యవసాయ రంగంలో పెను మార్పు తీసుకురాగలదని వారు పేర్కొన్నారు. దీన్ని అభివృద్ధి చేసిన స్వీడన్‌లోని లింకోపింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈసాయిల్ సహాయంతో కేవలం 15 రోజుల్లోనే పంట దిగుబడిని రెట్టింపు చేయవచ్చని పేర్కొన్నారు. PNAS జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన నివేదిక ప్రకారం ఇప్పుడు నగరాల్లో కూడా ఈ-మట్టి ద్వారా వ్యవసాయం చేయవచ్చు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ వ్యవసాయం సాధ్యమవుతుందని తెలిపారు.
లింకోపింగ్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎలెని బార్లీ మొక్కలపై ఈ మట్టిని ప్రయోగించారట. ఇందులో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయని తెలిపారు. 15 రోజులలో పంట రెట్టింపు అయిన ఈ సాయిల్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణ నేల కంటే సారవంతమైన మట్టిని తాము అభివృద్ధి చేశామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందులో మొక్కలు వేగంగా పెరుగుతాయి. విద్యుత్‌ను మట్టిలో పంపి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా శాస్త్రవేత్తలు మట్టిని సిద్ధం చేశారు. దానికి ఎలక్ట్రానిక్ మట్టి అని పేరు పెట్టాడు. ప్రపంచంలోని వాతావరణంలో ఎన్నో మార్పుల వస్తున్నాయి. భవిష్యత్తులో, ప్రస్తుత వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పంటలు పండించడం అంటే పెరుగుతున్న జనాభాకు సరిపోదు. అటువంటి పరిస్థితిలో, ఈ పద్ధతులు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంటాయి.
ప్రయోగం ఎలా జరిగింది ?
శాస్త్రవేత్తలు బార్లీ మొక్కల పై ఎలక్ట్రానిక్ మట్టిని ఉపయోగించారు. రూట్ సిస్టమ్‌లో విద్యుత్తు ఉపయోగించారు. దీనిని హైడ్రోపోనిక్స్ అంటారు. హైడ్రోపోనిక్స్ అనేది చాలా తక్కువ నీరు అవసరమయ్యి మొక్కలను పెంచే పద్ధతి. ఈ పద్ధతిలో ఇప్పటికే బార్లీ, మూలికలు, కొన్ని కూరగాయలను పండిస్తున్నారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్ మట్టి ఎలా తయారు చేశారు ?
eSoil సెల్యులోజ్ నుండి తయారు చేశారు. ఇందులో విద్యుత్ ప్రేరణను కలిగించారు. ఇది చాలా తక్కువ విద్యుత్ శక్తిని ఉపయోగిస్తుందని, అధిక వోల్టేజ్ ప్రమాదం లేదని పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైడ్రోపోనిక్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కొత్త అధ్యయనం కొత్త మార్గాలకు తెరలేపిందని పరిశోధకులు అంటున్నారు.