- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Smartphones:రూ. 30,000 లోపు ధరలో బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే!
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో త్వరలో 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్ కొనుగోలు ప్రక్రియ కూడా ముగిసింది. ప్రభుత్వం దీపావళి, లేదా అక్టోబర్ చివరి నాటికి 5G సేవలు తీసుకురానున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు 5G సేవలు అందుబాటులోకి రాకముందే 5G సపోర్ట్ అందించే స్మార్ట్‌ఫోన్‌లకు మారాలని అనుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది 5G స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు కూడా.
అయితే వీటి ధరలు కూడా అందుబాటు రేంజ్‌లో ఉండటంతో ప్రజలు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులు ఎక్కువగా రూ. 30,000 లోపు ఉండే 5G స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 30 వేల లోపు అందుబాటులో ఉన్న కొన్ని ఫోన్లను చూద్దాం..
రూ. 30,000 లోపు 5G ఫోన్‌లు
Motorola Edge ౩౦
Motorola Edge 30 స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల పూర్తి-HD+ OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ తెలిపింది. వెనుక భాగంలో 50MP+50MP+2MP కెమెరా సెటప్, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 32MP కెమెరాలను ఉంది.
Motorola Edge 30 ఎడ్జ్ స్నాప్‌డ్రాగన్ 778G+ 5G ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత My UXతో పని చేస్తుంది. 8GB RAMతో, 256GB వరకు మెమరీని అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.27,999.
Redmi K50i
స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ డిస్‌ప్లే, డైనమిక్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో 64MP+8MP+2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. MediaTek డైమెన్సిటీ 8100 SoCతో 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.25,999/ 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ.28,999. స్మార్ట్ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5080 mAh బ్యాటరీని కలిగి ఉంది.
OnePlus Nord 2T 5G
ఇది MediaTek డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌తో 12GB RAM, 256GB మెమరీని కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీని అందిస్తుంది. కేవలం 30 నిమిషాల్లో ఫోన్ పూర్తి ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. దీనిలో OIS సామర్థ్యంతో 50MP+8MP+2MP కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 28,999. 12 GB RAM + 256 GB వేరియంట్ ధర రూ. 33,999.