అందాల పోటీలో కంప్యూటర్ భామలు..ఏ AI సుందరిని గెలుపు వరించనుందో!

by Disha Web Desk 8 |
అందాల పోటీలో కంప్యూటర్ భామలు..ఏ AI సుందరిని గెలుపు వరించనుందో!
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపేరే వినిపిస్తుంది. ఏఐ ట్రెండ్ కొనసాగుతోంది. షాపింగ్ మాల్స్, కంపెనీస్‌లలో ఏఐ కనిపించి మనల్ని ఆకర్షిస్తుంటాయి.

అయితే తాజాగా ఏఐకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ,మిస్ యూనివర్స్ ఇలాంటి అందాల పోటీల గురించి అందరికీ తెలుసు.కానీ ప్రస్తుతం బ్యూటీ కాంటెస్ట్ జరగబోతుంది. ఇక ఇందులో పాల్గొనేది ఎవరో కాదు, అందాల ముద్దుగుమ్మలు, కంప్యూటర్ భామలంట.ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌తో క్రియేట్ చేయబడిన భామల మధ్య అందాల పోటీలంట..ఇక ఇందులో కూడా అన్ని పోటీలలానే నైపుణ్యం, ప్రతిభ, హావభావాలు ఆధారంగా తీసుకొని విజేతలను ఎంపిక చేస్తారు. ఇక ఈ పోటీలో ఏఐ ముద్దుగుమ్మలకు అందంతో పాటు, ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా మార్చడం అనే అంశంపై ఏఐ క్రియేటర్స్ ఏమనకుంటున్నారు? సాంకేతిక అంశాల గురించి ప్రశ్నలు వేయనున్నారంట. ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో గెలిచిన అందాల సుందరిలకు 15లక్షల వరకు ప్రైజ్ మనీ అందించనున్నట్లు ఫన్ వే సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఇంకెందుకు ఆలస్యం ఏఐ బ్యూటీ ఫోటో పంపించి, విజేతలుగా నిలవండి.

Next Story

Most Viewed