- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ యూజర్లకు షాక్!
దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్ సంస్థ తన యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి అన్ని ట్విట్టర్ అకౌంట్లకు బ్లూటిక్ వెరిఫికేషన్‌ను తొలగిస్తున్నట్లు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ శుక్రవారం తెలిపారు. నిర్ణీత మొత్తంలో అమౌంట్ చెల్లించిన వారు మాత్రమే ఈ వెరిఫికేషన్ లోగోను కలిగి ఉంటారు. మిగతా వారికి ఈ లోగో కనిపించదు. ఏప్రిల్ 1 తరువాత బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ కావాలనుకున్న వారు అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ బ్లూటిక్ మార్క్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇండియాలో ట్విట్టర్ బ్లూ వెబ్ వినియోగదారులకు నెలవారీ ఫీజు రూ. 650, అదే, మొబైల్ యూజర్లకు నెలవారీ ఫీజును రూ. 900 గా నిర్ణయించారు. బ్లూటిక్ వెరిఫికేషన్‌ను తీసుకోవడం ద్వారా యూజర్లు 4,000 అక్షరాల వరకు గల ట్వీట్‌లను పోస్ట్ చేయడానికి అనుమతి ఉంటుంది. అలాగే యాడ్స్ కూడా తక్కువగా కనిపిస్తాయి.