AI orders : తల్లిదండ్రులను చంపేయమని..బాలుడికి ఏఐ ఆదేశాలు!

by Y. Venkata Narasimha Reddy |
AI orders : తల్లిదండ్రులను చంపేయమని..బాలుడికి ఏఐ ఆదేశాలు!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులు మానవాళికి మంచితో పాడు చెడును కూడా కల్గిస్తున్నాయి. ప్రపంచంలో అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence)టెక్నాలాజీ తెచ్చిన మార్పులు అన్నిఇన్ని కావు. సాంకేతిక రంగంలో విప్లవంగా మారిన ఏఐ(AI) టెక్నాలాజీ దెబ్బకు మనుషులతో పనిలేకుండానే చాల పనులు చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే ఏఐ టెక్నాలాజీ తో లాభాలతో పాటు నష్టాలు ఎదురవుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా అమెరికాలోని ఓ బాలుడికి తన తల్లిదండ్రులను చంపేయమంటూ ఏఐ సలహా ఇవ్వడం సంచలనంగా మారింది. అమెరికాలోని టెక్సాస్‌(Texas, USA)లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని.. కుమారుడ్ని తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఏఐ చాట్‌బాట్(AI ChatBots) ‘క్యారక్టర్.ఏఐ’(CharacterAI)ని ఆశ్రయించి తన సమస్యను వివరించాడు. పేరెంట్స్ తనని ఫోన్ చూడనివ్వడం లేదంటూ చాట్‌బాట్‌తో ఆవేదన వ్యక్తం చేశాడు. అశ్చర్యంగా అది ‘నేను చెప్తున్నాగా..నీ తల్లిదండ్రుల్ని చంపేయ్’ అంటూ రిప్లయి ఇచ్చింది. ఇది తెలుసుకున్న ఆ బాలుడి పేరెంట్స్ కోర్టుని ఆశ్రయించారు. దీంతో ‘క్యారక్టర్.ఏఐ’ సంస్థ న్యాయపరమైన చిక్కు్ల్లో పడగా..ఈ వివాదం ఏఐ సాంకేతికతను మరోసారి ప్రశ్నార్ధకం చేసింది.

Next Story