ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమ్ ఇండియా

by Shiva |
ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమ్ ఇండియా
X

దిశ, స్పోర్ట్స్: సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా ప్రస్తుతం సౌతాంప్టన్‌లోని హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల కఠిన క్వారంటైన్ ముగియడంతో సోమవారం నుంచి భారత జట్టు ప్రాక్టీస మొదలు పెట్టింది. టీమ్ ఇండియా బస చేస్తున్న హోటల్‌ను ఆనుకొని ఉన్న క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆదివారం రవీంద్ర జడేజా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక సోమవారం సిరాజ్, అశ్విన్, పంత్ మైదానంలో పరుగులు తీస్తూ కనపడ్డారు.

ఇంకా పూర్తి స్థాయి ప్రాక్టీస్ మొదలు పెట్టక పోయినా.. లైట్ ట్రైనింగ్ సెషన్లు మొదలు పెట్టారు. కోచ్ రవిశాస్త్రి, సహాయక కోచ్‌లు త్వరలో టీమ్ ఇండియాతో పూర్తి స్థాయిలో సాధన చేయించనున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు మహిళల టీమ్ మాత్రం ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నది. ఇండోర్‌లోనే ట్రైనింగ్ సెషన్లు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో బ్రిస్టల్‌కు బయలు దేరి వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed