- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఫైనలే మా టార్గెట్ : రహానే
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరడమే తమ లక్ష్యమని టీమ్ ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే వ్యాఖ్యానించాడు. నాలుగో టెస్టును డ్రాగా ముగించినా ఫైనల్స్ చేరతామనే విషయం తమకు తెలుసనీ.. కానీ తాము మాత్రం విజయం సాధించడానికే సిద్దపడుతున్నట్లు రహానే వెల్లడించాడు. ]
‘వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ గెలవడమంటే వరల్డ్ కప్ గెలవడంతో సమానం. కాబట్టే మేం ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాము. ఫైనల్ చేరడమే కాదు.. అక్కడ విజయం కూడా సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాము. మేము ప్రతీ మ్యాచ్ ఒక లక్ష్యంగా కొనసాగుతున్నాము. ప్రస్తుతానికి నాలుగో టెస్టుపైనే పూర్తి దృష్టి కేటాయించాము. ఇంగ్లాండ్ జట్టును గత రెండు మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన వారిని తేలికగా తీసుకోము’ అని రహానే తెలిపాడు. కాగా, విరాట్ కోహ్లీ ఇప్పటికే కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. కానీ తన ఖాతాలో ఇప్పటికీ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా లేదు. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ గెలుచుకునే అవకాశం ఉండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.