బెంగాల్ క్రీడా శాఖ మంత్రిగా మాజీ క్రికెటర్

by Anukaran |   ( Updated:10 May 2021 11:59 PM  )
బెంగాల్ క్రీడా శాఖ మంత్రిగా మాజీ క్రికెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో సోమవారం కొత్త మంత్రివర్గం ఏర్పాటైన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పడిన బెంగాల్‌ కేబినెట్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్‌ తివారి చోటు దక్కించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో శివ్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మనోజ్ తివారీ కి మమత యువజన, క్రీడా శాఖ మంత్రి పదవిని అందించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మనోజ్ తివారీ క్రీడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ప్రమాణ స్వీకారం తనకు కొత్త అనుభూతినిచ్చిందని, తనపై నమ్మకంతో ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన దీదీ మమత, తన సోదరుడు అభిషేక్‌లకు కృతజ్ఞతలు అని తెలిపారు. ఇక భారత్ తరఫున 2008లో అరంగేట్రం చేసిన మనోజ్ తన కెరీర్‌లో 12 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.

Advertisement
Next Story

Most Viewed