ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

by Sridhar Babu |
ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
X

దిశ, సత్తుపల్లి: విద్యార్థులకు మంచి, చెడూ నేర్పాల్సిన ఉపాధ్యాయుడే సహా ఉపాధ్యాయురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే.. సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న గొర్ల వీరారెడ్డి తనతో పాటు లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న మరో అధ్యాపకురాలికి ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపి లైంగిక వేధింపులకు గురిచేశాడు. విషయం తెలిసిన ఆమె కుటుంబసభ్యులు సదరు లెక్చరర్‌కు కళాశాలలోనే దేహశుద్ధి చేశారు.

అనంతరం ఆర్థిక, రాజకీయ బలం ఉందనే వీరారెడ్డి ఈ విధమైన ఆగడాలకు పాల్పడుతున్నాడని, గతంలోనూ ఆయన చర్యలకు పాల్పడ్డాని వాపోయారు. అనంతరం వీరారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు జేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్ చందర్ రావును సంప్రదించగా, అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమే అని స్పష్టం చేశారు. అతేగాకుండా అతనిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

Next Story