- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో నానిలా పెద్ద హీరోలు కూడా మాట్లాడాలి..
దిశ, ఏపీ బ్యూరో: సినీ హీరో నానికి టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత థ్యాంక్స్ చెప్పారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా ఖండించినందుకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై హీరో నాని మాట్లాడటం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. విశాఖలో గురువారం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. నాని మాదిరి టాలీవుడ్ కు చెందిన పెద్ద హీరోలు కూడా ఈ అంశంపై మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద హీరోలు విజయవాడకు వచ్చి సీఎం జగన్‌ను, మంత్రి పేర్ని నాని ని కలిసి వెళ్లడం కాదంటూ సెటైర్లు వేశారు. సినీ పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై ధైర్యంగా మాట్లాడాలంటూ.. సూచించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ రంగం నాశనమైందని విమర్శించారు. చివరికి సినిమా రంగాన్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అనిత ఆరోపించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై హీరో నాని మాట్లాడటం నిజంగా అభినందించదగ్గ విషయమని ప్రశంసించారు. వైసీపీ ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపుతుంటే వైసీపీ మంత్రులు, అభిమానులు తట్టుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారి ఇళ్లలోని మహిళలను టార్గెట్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పును నాని ఎత్తి చూపారు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్న మహిళలను వైసీపీ మంత్రులు టార్గెట్ చేస్తారంటూ ధ్వజమెత్తారు. నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజునే ఏపీ మంత్రులు తిట్టారని.. అలాంటిది నాని కుటుంబ సభ్యులను తిట్టడం పెద్ద విషయం కాదంటూ వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Tags
- hero nani